Hemoglobin | హిమోగ్లోబిన్ తగ్గడానికి కారణాలేంటి? న్యాచురల్ గా ఎలా పెంచుకోవచ్చు?

-

రక్తంలో హిమోగ్లోబిన్(Hemoglobin) ముఖ్యమైన భాగం. రక్తం ఎరుపు రంగులో ఉండటానికి కారణం హిమోగ్లోబినే. ఇది ఆక్సిజన్ ను, పోషకాలను శరీరానికి అంతటికి సప్లయ్ చేస్తుంది. శరీరంలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ను కలెక్ట్ చేసుకుని ఊపిరితిత్తులకు చేరవేస్తుంది. ఊపిరితిత్తులు కార్బన్ డై ఆక్సైడ్ ను బయటకు వదులుతాయి. ఇలా మన శరీరంలో అతిముఖ్యమైన పని చేసే హిమోగ్లోబిన్ కొంత మందిలో తక్కువ ఉండటానికి కారణాలు ఉన్నాయి.

- Advertisement -

హిమోగ్లోబిన్ లెవల్స్ తక్కువగా ఉన్నప్పుడు బయటకి పెద్దగా లక్షణాలు కన్పించవు. అలసట, నీరసం, తరచు తలనొప్పి, చర్మం పాలిపోయినట్టు ఉంటుంది. బ్లడ్ రిపోర్ట్ లో హిమోగ్లోబిన్ లెవల్ స్పష్టంగా తెలుస్తుంది. మగవాళ్లకు 13.5 నుంచి 17.5 వరకు, ఆడవాళ్లకు 12 నుంచి 15.5 వరకు నార్మల్ లెవల్స్. ఇంతకన్నా తక్కువగా ఉంటే బ్లడ్ లో ఐరన్ తక్కువగా ఉన్నట్టే. వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.

తిండి సరిగ్గా తిననివాళ్లకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. ఆడపిల్లల్లో ఈ పరిస్థితి ఎక్కువ. వీళ్లకు పిరియడ్స్ కూడా తక్కువగా ఉంటాయి. పేయిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. పోషకాహార లోపంతో పాటు లివర్ ప్రాబ్లమ్, పిరియడ్స్ సమస్యతో రక్తం ఎక్కువగా పోవడం, హార్మోన్స్ బాలన్స్ తప్పడం, మూత్రపిండాల సమస్యలు, లుకేమియా, తలసేమియా లాంటి జబ్బుల వల్ల కూడా రక్తం తగ్గిపోవచ్చు.

Hemoglobin | రక్తం పెరగడానికి ఇలా చేయండి:

1.ఉదయాన్నే మూడు అంజీరా డ్రై ఫ్రూట్స్ శుభ్రంగా కడిగి, ఒక గంట నానబెట్టండి. నానిన పండు పొట్టు తీసి తినండి. పండును నానబెట్టిన వాటర్ కూడా తాగాలి.

2.మధ్యాహ్నం భోజనం తరువాత ఒక దానిమ్మ కాయను వలుచుకుని డైరెక్ట్ గా తినాలి. లేదా జ్యూస్ చేసుకుని తాగొచ్చు.

3.సాయంత్రం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తీసుకోవాలి. ఒక రోజు క్యారెట్, మరో రోజు బీట్రూట్ జ్యూస్ తాగాలి. ఇలా రెగ్యులర్ గా మూడు నెలలపాటు చేస్తే చాలా నేచరల్ గా హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి.

గమనిక: డయబేటిక్ పేషెంట్లు, జలుబు, దగ్గు ఉన్నవాళ్లు, ఆస్తమా, డైజెషన్ సమస్యలు ఉన్నవాళ్లు ఇలా తీసుకోవడం కుదరదు. వారు డాక్టర్ సలహాతో ఇతర పద్ధతులు పాటించాల్సి ఉంటుంది.

Read Also:
1. నిద్రలో గురక పెడుతున్నారా? ఈ సమస్యని చిన్నదిగా చూడకండి..
2. పరగడుపునే తేనెలో నానబెట్టిన వెల్లుల్లి తింటే అద్భుత ప్రయోజనాలు

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...