కొన్ని దశాబ్దాలుగా పట్టాల కోసం ఎదురుచూస్తున్న పోడు భూముల(Podu Lands) రైతులకు కేసీఆర్(KCR) ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈనెల 30వ తేదీ నుంచి పోడు భూముల(Podu Lands) పట్టాల పంపిణీకి ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలో ఈనెల 30న జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ఈ పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. ఆయన చేతుల మీదుగా ఆ ప్రాంత పోడు భూముల రైతులకు స్వయంగా పట్టాలు అందజేయనున్నారు. అదేవిధంగా అదేరోజున వివిధ ప్రాంతాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా పోడుభూముల వ్యవసాయ దారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. కాగా, ఈనెల 24 నుంచే పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రకటించినప్పటికీ కొన్ని అనివార్య కారణాలచేత ఈనెల 30 తేదీకి మార్చవలసి వచ్చింది. జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండటం, అందుకు సంబంధించి నిన్న, ఇవాళ జిల్లా కలెక్టర్లకు శిక్షణాతరగుతులు నిర్వహస్తుండటం, అదే సందర్భంలో ఈనెల 29న బక్రీద్ పండుగ కూడా వుండటం, వీటన్నిటి నేపథ్యంలో ప్రకటించిన కార్యక్రమాన్ని జూన్ 30కి మార్చారు. జూన్ 30న నూతనంగా నిర్మితమైన అసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
Read Also:
1. హిమోగ్లోబిన్ తగ్గడానికి కారణాలేంటి? న్యాచురల్ గా ఎలా పెంచుకోవచ్చు?
2. వాహనదారులకు శుభవార్త.. త్వరలోనే చమురు ధరలు తగ్గింపు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat