Vizag |విశాఖ జిల్లా మాడుగుల మండలంలోని పోతనపూడి అగ్రహారం గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు వడ్డీ రాము, చొప్ప గడ్డి త్రిమూర్తులు, బంటు చందర్రావు, మేలిపాక రాము, శ్రీను, గణేష్, నారాయణరావు, మట్టా అప్పారావు, గండెం చిన్న, గోపాలకృష్ణ, ఊటరాజు, గుమ్మాల గణేష్, ఇల్లాగంతుల పరదేశి, మైచర్ల అప్పలనాయుడు, ఊట చిరంజీవి వంటి నేతలు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు(Mutyala Naidu) సమక్షంలో శనివారం వైసీపీలో చేరారు. వారికి వైసీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న పథకాలు మెచ్చి ఇతర పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు వైసీపీలో రావడం పై హర్షం వ్యక్తం చేశారు.
Read Also:
1. ఈ కీచకపాలన ఎవరికోసం జగన్మోహన్ రెడ్డి?
2. మార్టీ మార్పు వార్తలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat