Dandruff | తలలో చుండ్రు తరచూ వస్తుంటే ప్రమాదమా??

-

Dandruff |చుండ్రు అంటే స్కాల్ప్ పై ఏర్పడిన డెడ్ సెల్. ఏదైనా సమస్యతో తలపైన చర్మం ఎఫెక్ట్ అయితే.. చర్మం ఆ కణాలను వదిలించుకుని, కొత్త కణాలను తయారు చేసుకుంటుంది. వదిలించుకున్న మృతకణాలే డాండ్రఫ్. నార్మల్ గా ఇలా ఎప్పుడైనా ఒకసారి స్కిన్ ఎఫెక్ట్ అయినప్పుడు వచ్చిన డాండ్రఫ్ అదే తగ్గిపోతుంది. అలా కాకుండా రెగ్యులర్ గా ఉంటే మాత్రం ప్రమాదానికి సంకేతమే.

- Advertisement -

Dandruff | డాండ్రఫ్ లో రకాలు :

డ్రై స్కిన్ డాండ్రఫ్ : ఇది నార్మల్ డాండ్రఫ్. ఇది సహజంగా స్కాల్ప్ బాగా డ్రైగా ఉన్నప్పుడు వస్తుంది. ఎక్కువగా చలికాలంలో. ఇలా వచ్చినప్పుడు రెగ్యులర్ గా ఏదైనా డాండ్రఫ్ ఆయిల్ పెట్టి స్నానం చేస్తుంటే తగ్గిపోతుంది. ఈ టైప్ డాండ్రఫ్ ప్లేక్స్ చిన్నవిగా ఉంటాయి. స్కాల్ప్ లైట్ గా దురదగా ఉంటుంది.

ఆయిలీ స్కిన్ డాండ్రఫ్ : చర్మ రక్షణ కోసం గ్రంధులు సెబమ్ అనే ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది ఎక్కువ అయినప్పుడు స్కిన్ ఆయిలీ గా అవుతుంది. ఇలాంటి స్కిన్ పై వాతావరణంలోని కాలుష్యం కలిసినప్పుడు డాండ్రఫ్ గా మారుతుంది. డ్రై స్కిన్ డాండ్రఫ్ తో పోలిస్తే ఈ డాండ్రఫ్ ఫ్లేక్స్ సైజ్ ఎక్కువగా ఉంటుంది. లేత పసుపు రంగులో ఉంటాయి. తలలో దురద ఉంటుంది. గోర్లతో తలపై గీకి చూస్తే.. గోర్ల నిండుగా వస్తుంది.

ఫంగస్ రిలేటెడ్ డాండ్రఫ్ : మలసెజ్జియా అనే ఒక రకం ఫంగస్ వల్ల కూడా డాండ్రఫ్ వస్తుంది. ఇది ఒకరకమైన ఎగ్జిమా. ఇది స్కాల్ప్ లోకి చేరిన తరువాత దురదతో కూడిన డాండ్రఫ్ మొదలవుతుంది. మంచి మెడికేటెడ్, నేచురల్ ఆయిల్ షాంపు వాడితే ఈ ఫంగస్ డాండ్రఫ్ తొందరగానే తగ్గిపోతుంది.

డిసీజ్ రిలేటెడ్ డాండ్రఫ్ : సెబోరిక్ డెర్మటైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్.. ఈ వ్యాధుల వల్ల కూడా డాండ్రఫ్ వస్తుంది. ఇది పట్టి వదలని రకం డాండ్రఫ్. కేర్ తీసుకోకపోతే జుట్టు మొత్తం రాలిపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యల మూల కారణాలపై కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సోరియాసిస్ కి రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏరకం డాండ్రఫ్ ను ఈజీగా తీసుకోవద్దు. ఇవి రెగ్యులర్ గా కేర్ తీసుకోవాల్సినవి. డాక్టర్ ని సంప్రదించి జాగ్రత్తలు పాటించకపోతే జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది.

Read Also:
1. హిమోగ్లోబిన్ తగ్గడానికి కారణాలేంటి? న్యాచురల్ గా ఎలా పెంచుకోవచ్చు?
2. మజిల్ రికవరీ కోసం మీ డైట్ లో ఇవి ఉండాల్సిందే!!

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....

THSTI లో ప్రాజెక్ట్ రీసెర్చ్ స్టాఫ్ కి నోటిఫికేషన్

ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్...