రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు(Dalit Bandhu) సెకండ్ ఫేజ్ ప్రక్రియను ప్రారంభించడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. జూలై ఫస్ట్ వీక్ నుంచి లాంచనంగా ప్రారంభించేందుకు ఎస్సీ సంక్షేమ శాఖ ప్లాన్ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1100 మంది చొప్పున లబ్ధిదారులకు ఈ స్కీమ్ కింద సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం జారీ చేసిన జీవోతో క్లారిటీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యేనాటికి రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వెంటనే లబ్ధిదారులకు సాయం అందించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు 1100 మంది చొప్పున హుజూరాబాద్ మినహా మిగిలిన 118 నియోజకవర్గాల్లో 1,29,800 మందికి సాయం(Dalit Bandhu) అందించాల్సి ఉన్నది. బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకొని ఒక్కో సెగ్మెంట్‌కు 200 మంది లేదా మాగ్జిమమ్ 300 మందికే పరిమితం చేసి మిగిలిన లబ్ధిదారుల విషయం కొత్త ప్రభుత్వానికి వదిలేసే అవకాశముందన్నదని సమాచారం. ఆర్థిక శాఖ నుంచి విడుదలయ్యే నిధులపై ఆధారపడి లబ్ధిదారుల ఖాతాల్లో ఏ మేరకు జమ అవుతుందన్నది స్పష్టం కానున్నది.
Read Also:
1. 75 స్థానాల్లో కాంగ్రెస్ సులువుగా గెలుస్తుంది: కోమటిరెడ్డి
2. తెలంగాణలో తామే కింగ్ మేకర్: MIM చీఫ్ కీలక వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat