Sunil Gavaskar | అతడే ఒరిజినల్ కూల్ కెప్టెన్.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు

-

టీమిండియా మాజీ స్టార్ క్రికెట్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అసలైన కూల్ కెప్టెన్ కపిల్ దేవ్ అని వ్యాఖ్యానించారు. కపిల్ దేవ్ నాయకత్వంలో 1983లో టీమ్ ఇండియా తొలిసారి వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. తొలి ప్రపంచకప్ గెలిచి సరిగ్గా 40 ఏళ్లు అవుతోంది. 1983 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన సునీల్ గవాస్కర్ తాజా ఇంటర్వ్యూలో అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. ‘బ్యాటుతోపాటు బంతితోనూ కపిల్ దేవ్(Kapil Dev) ప్రదర్శన అబ్బురపరిచింది. వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్‌లో వివి రిచర్డ్స్ క్యాచ్‌ను అతను అందుకున్నది మర్చిపోకూడదు. ఫార్మాట్‌కు అవసరమయ్యేలా కపిల్ దేవ్ కెప్టెన్సీ డైనమిక్‌గా ఉండేది. ఆటగాళ్లలో ఎవరైనా క్యాచ్‌ను వదిలేసినా లేదా ఫీల్డింగ్ సరిగా చేయకపోయినా చిరునవ్వుతో ఉండేవాడు. అందుకే అతను ఒరిజినల్ కెప్టెన్ కూల్.’ అని గవాస్కర్(Sunil Gavaskar) తెలిపాడు.

- Advertisement -
Read Also:
1. ఏకైక టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం
2. పెళ్లిపై నటి ప్రియమణి షాకింగ్ కామెంట్స్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...