ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఎప్పటికైనా చారిత్రకమైన రాజధానిగా నిలిచిపోతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల త్యాగాలకు ధీటుగా, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక సర్వోత్తమమైన రాజధానిగా అమరావతిని ఎంపిక చేసుకుని, అసెంబ్లీ భవనాలు, హైకోర్టు భవనాలు, సచివాలయ భవనాలు, సీడ్ యాక్సిస్ రోడ్డు, దానికి అనుగుణంగా ఇతర రహదారులు నిర్మించుకుంటే ఇప్పుడీ పెద్దమనిషి వచ్చి రాజధానిని ముక్కలు చేస్తానంటే మనం నోరుమూసుకు కూర్చోకూడదని చంద్రబాబు(Chandrababu) పిలుపునిచ్చారు. భూములిచ్చిన రైతుల ఆవేదనని ఏమాత్రం పట్టించుకోని ఈ ముఖ్యమంత్రి రైతులు, ప్రజల ఉసురు తగిలి ఇంటికి పోయే సమయం వచ్చేసిందన్నారు. ఈ పెద్దమనిషి పిచ్చి చేష్టల వల్లే ఏపీలో భూముల(Eeal-Estate) ధరలు నేలమట్టమయ్యాయని చెప్పుకొచ్చారు. బొప్పన విజయ్ కుమార్ అనారోగ్యంతో బాధ పడుతున్నప్పటికీ ఈ పుస్తకాన్ని పట్టుదలతో తీసుకొచ్చారన్నారు. నాలుగేళ్ళ అమరావతి ఉద్యమాన్ని, అమరావతి రైతుల ఆకాంక్షల్ని, ఆవేదనల్ని, ఇబ్బందుల్ని, అణచివేతల్ని ఈ పుస్తకంలో పొందుపరిచారన్నారు.
Read Also:
1. మెట్రోలో మద్యం తీసుకెళ్లడానికి అనుమతి
Follow us on: Google News, Koo, Twitter, ShareChat