చిరంజీవికి కన్నబాబు ఫోన్ కాల్ ఏమన్నారంటే

చిరంజీవికి కన్నబాబు ఫోన్ కాల్ ఏమన్నారంటే

0
93

మంత్రి కురసాల కన్నబాబుపై పవన్ కల్యాణ్ వీర లెవల్లో విమర్శలు చేస్తున్నారు.. గతంలో పవన్ కల్యాణ్ కన్నబాబు మంచి స్నేహితులు.. కాని ఇప్పుడు వైరి వర్గాలుగా మారిపోయారు.. సరిగ్గా పదేళ్ల క్రితం కన్నబాబు చిరంజీవి పక్కన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు. కాని ఇప్పుడు జగన్ పక్కన మంత్రి అయ్యారు.

అయితే కన్నబాబుపై తీవ్రస్ధాయిలో పవన్ విమర్శలు చేయడం చాలా మంది హర్షించడం లేదు. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలపడానికి కురసాల కన్నబాబు కారణం అనేలా పవన్ వ్యాఖ్యలుచేశారు.. నిజంగా చిరంజీవి ఎవరైనా చెబితే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా ? అసలు ఇది వాస్తవమా? పవన్ కల్యాణ్ మాత్రం ఆసోయ లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు.

అయితే రాజకీయాలకు కొద్ది రోజులుగా దూరంగా చిరంజీవి ఉన్నారు. కాని కన్నబాబుతో మాత్రం చాలా దగ్గరగా ఉంటున్నారు.. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కన్నబాబుతో ఫోన్లో మాట్లాడారు అని తెలుస్తోంది.. పవన్ చేసిన కామెంట్లు పర్సనల్ గా తీసుకోవద్దు అన్నారట… అంతేకాదు రాజకీయంగానే పవన్ విమర్శలు చేశారు అని కన్నబాబుతో అన్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.