Samantha | అభిమానులకు షాక్ ఇస్తూ సమంత సంచలన నిర్ణయం

-

సమంత – నాగచైతన్య(Naga Chaitanya) ల ప్రేమ వ్యవహారం బయట ప్రపంచానికి తెలిసినప్పటి నుండి.. నిత్యం సమంత(Samantha)కు సంబంధించిన ఏదో ఒక వార్త ట్రెండింగ్ లో ఉంటూనే ఉంది. సమంత నటించిన సినిమాలు, సాధించిన ఘనతలు, చేసిన సోషల్ సర్వీస్ ల కంటే.. అక్కినేని వారసుడితో ప్రేమ, పెళ్లి, విడాకులకు సంబంధించిన విషయాలే ఆమెపై ఎక్కువ అటెన్షన్ తెచ్చిపెట్టాయి అనడంలో అతిశయోక్తి లేదని చెప్పాలి. అంతలా సమంత పర్సనల్ లైఫ్ పై సామాన్యుల్లో ఆసక్తి నెలకొంది.

- Advertisement -

విడాకుల తర్వాత చేతినిండా సినిమా ఆఫర్లు ఉన్నప్పటికీ సమంత కెరీర్ సజావుగా కొనసాగుతున్నట్టు కనిపించడం లేదు. ఆమె నటించిన సినిమాలు అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. భారీ అంచనాలతో విడుదలైన యశోద, శాకుంతలం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. యశోద పర్లేదు అనిపించినా.. శాకుంతలం మాత్రం డిజాస్టర్ గా నిలిచి బోలెడన్ని విమర్శలు మూటగట్టుకుంది. సమంత యాక్టింగ్ ఇమేజ్ ని ఊహించని విధంగా డ్యామేజ్ చేసింది. ఈ సినిమాలో ఆమె నటన, సొంత డబ్బింగ్ డై హార్డ్ ఫ్యాన్స్ ని కూడా నిరాశపరిచాయి.

మరోవైపు ఆరోగ్య సమస్యలు కూడా సమంతను పట్టిపీడిస్తున్నాయి. ట్రీట్మెంట్ కోసం సమంత తరచూ మూవీ షూటింగ్స్ కి బ్రేక్ తీసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో సమంత మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో కలిసి నటిస్తున్న ఖుషి(Kushi) సినిమా ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ 2-3 రోజుల్లో పూర్తవుతుందని, ఆ తర్వాత ఏడాది పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు టాక్. గతేడాది మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత(Samantha).. కొద్దిరోజులు బ్రేక్ తీసుకుని వరుస సినిమాలు చేశారు. ఇప్పుడు ఆరోగ్యంపై దృష్టి పెట్టనున్నారట.

Read Also:
1. విజయ్‌ను ప్రేమించడానికి బలమైన కారణం ఇదే: తమన్నా
2. ఎక్కువ రోజులు శృంగారానికి దూరంగా ఉంటే.. స్త్రీలకు ఆ సమస్యలు!

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...