టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) దూకుడు పెంచారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో 120 రోజులు ఇంటికి సెలవు పెట్టి కష్టపడి పని చేయాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఎన్నికల చట్టాల్లో మార్పులను ఉపయోగించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నాయని తెలిపారు. దీనిని ఎదుర్కొనేందుకు చేయాల్సిన కార్యాచరణ కోసమే ఈ కార్యక్రమమని చెప్పారు. బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS)ను ధీటుగా ఎదుర్కొనేందుకు తమ శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధులను చేసుకోవాలని వెల్లడించారు. గాంధీ భవన్(Gandhi Bhavan) నుంచి, గ్రామస్థాయి వరకు అందరూ అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. మండల, డివిజన్, జిల్లా, పట్టణ అధ్యక్షులకు బోయినపల్లి రాజీవ్ నాలెడ్జ్ సెంటర్ లో జూలై 18న ట్రైనింగ్ ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 15 లోగా మండలాలు, డివిజన్ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేస్తామని ఆయన(Revanth Reddy) స్పష్టం చేశారు.
Read Also:
1. ఇవి తింటే ఉన్న వయసుకంటే 10 ఏళ్లు యంగ్ గా కనిపిస్తారు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat