Vastu Tip for Broom | ఇంట్లో మనం నిత్యం ఉపయోగించే వస్తువులు, చేసే పనులలో పని కొన్నిరకాల సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని వాస్తుపరమైనవి అయితే, మరికొన్ని గృహాలంకరణ విషయాలు. అయితే మనలో ఎక్కువమందికి సహజంగా ఉండే సందేహం చీపురు ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ దిశ నుండి ఏ దిశవైపు ఊడ్చుకెళ్ళాలి అని. చీపురుని తొక్కకూడదు, దాటకూడదు అని చాలామంది ఇళ్లలో చెబుతూ ఉంటారు. కానీ అసలు కారణం మాత్రం చెప్పరు. ఇప్పుడు ఈ సందేహాలకు వాస్తు పరంగా, సైంటిఫిక్ గా రీజన్స్ ఏంటో తెలుసుకుందాం.
చీపురుతో ఇంటిని చిమ్ముతాం కాబట్టి దానికి దుమ్ము, ధూళి అంటుకుంటాయి. అది పాదాలకు అంటుకుంటే దానికి ఉన్న బ్యాక్టీరియా మనం నడుస్తున్నప్పుడు ఫ్లోర్ అంతా స్ప్రెడ్ అవుతుంది. చిన్న పిల్లలు కింద ఉన్న వస్తువులు నోట్లో పెట్టేసుకుంటారు. దీంతో వారు ఇన్ఫెక్షన్స్ బారిన పడి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే చీపురిని దాటకూడదు, తొక్కకూడదు అని చెబుతూ ఉంటారు.
Vastu Tip for Broom | వాస్తు పరంగా గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి వైపుకు చిమ్మి చెత్తను పోగు చేయాలట. ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదని పండితులు చెబుతున్నారు. ఈశాన్యం వైపు చెత్తను పోగు చేస్తే ఆ గృహంలో సంపద నిలకడగా ఉండదట. ఇంటిని చిమ్మే చీపురు శనీశ్వరుని ఆయుధమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈశాన్యం దర్వాజా తప్ప ఏదైనా డోర్ వెనుకవైపు గోడకు ఒక మేకు కొట్టి చీపురు హ్యాండిల్ పైకి వచ్చేలా మాత్రమే పెట్టి ఉండాలి. రివర్స్ పెడితే ఇంట్లో శని దేవుని నిలుపుకున్నట్లే అవుతుంది. చీపురు ఇంటికి వచ్చిన అతిథులకు కనబడకుండా ఉండాలి, కాబట్టి డోర్ వెనక భాగంలో పెట్టుకొమ్మని సలహా ఇవ్వడం జరుగుతుంది.
Read Also: ఈ చిన్న పరిహారంతో సంపద పెరిగి దరిద్రం పరార్…
Follow us on: Google News, Koo, Twitter, ShareChat