దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర ఎంతో ఉందని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. రాష్ట్రం కొత్తగా ఏర్పడినా ఎంతో కీలకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. తెలుగువారి ప్రతిభ దేశసామర్థ్యాన్ని పెంచిందని ప్రశంసించారు. తెలంగాణలో కనెక్టివిటీ పెంచేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. కొత్త లక్ష్యాల కోసం కొత్తమార్గాలను అన్వేషించాల్సిందేనని స్పష్టం చేశారు.
సరైన లాజిస్టిక్స్ సదుపాయం లేకపోతే వ్యాపారాలు నష్టపోతామని చెప్పారు. 2,500 కి.మీ జాతీయ రహదారులు ఇప్పుడు 5 వేల కిలోమీటర్లకు చేరాయన్నారు. తెలంగాణ లో రూ.6వేల కోట్లతో కొత్త జాతీయ రహదారిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. చుట్టుపక్కల ఆర్థిక కేంద్రాలను తెలంగాణ జోడిస్తోందని.. తెలంగాణ ఆర్థిక హబ్(Financial Hub) గా ఎదుగుతోందని మోదీ తెలిపారు. ఈ రాష్ట్రంలో పెట్టుబడులకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, రాష్ట్ర అభివృద్ధికి గత తొమ్మిదేళ్లుగా ఎంతో కృషి చేస్తున్నట్లు మోదీ(PM Modi) తెలిపారు.
Read Also: BRS కి ట్రైలర్ చూపించాం – మోదీ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat