ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం(Prakasam) జిల్లా దర్శి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దర్శి(Darsi) దగ్గర సాగర్ కెనాల్లో అదుపుతప్పి పెళ్లి బృందం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఓ చిన్నారి, ఓ యువకుడు కూడా ఉన్నాడు. మరో 30 మందికి గాయాలయ్యాయి. పొదిలి(Podili) నుంచి కాకినాడ(Kakinada)కు వివాహ రిసెప్షన్ కోసం వెళుతుండగా డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలిసింది. వీరంతా పొదిలిలో సోమవారం జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరై కాకినాడలో రిసెప్షన్ కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులో బయలుదేరింది పెళ్లి బృందం. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో బోల్తా పడిన బస్సును బయటకు తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: గంగా నదిని క్లీన్ చేయనున్న తాబేళ్లు
Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat