ప్రముఖ యాంకర్ శివానీ సేన్(36) హఠాన్మరణం చెందారు. మెదడు సంబంధిత సమస్య కారణంగా ఆమె తుదిశ్వాస విడిచారు. తన మాటల పలుకులతో వందలాది షోలు, ఈవెంట్లను సక్సెస్ఫుల్ చేసిన శివానీ(Anchor Shivani Sen)కి నివాళులు అర్పిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థిస్తున్నారు. కాగా, 2005లో హోస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు శివానీ. ఆ తర్వాత పలు కార్పొరేట్ ఈవెంట్లు, కాన్ఫరెన్స్‌లు, ప్రభుత్వ కార్యక్రమాలు, మీడియా ఈవెంట్స్, సెలబ్రిటీల పెళ్లి వేడుకలు, ఫ్యాషన్ షోలు.. ఇలా సందర్భమేదైనా తన యాంకరింగ్‌తో ఆ ఈవెంట్లను సక్సెస్ చేసిందామే.
హంస ఫర్ వెడ్డింగ్ అనే మ్యారేజ్ ఈవెంట్ కంపెనీలో భాగస్వామిగా ఉన్న ఆమె తెలంగాణా చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీని కూడా ప్రారంభించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలకు శివానీ(Anchor Shivani Sen) హోస్ట్‌గా వ్యవహరించారు.
Read Also: ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat