ఉత్తర్ప్రదేశ్(Uttar Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ వేపై మంగళవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన ఓ స్కూల్ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు స్పాట్ లోనే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో విద్యార్థులు లేనట్లు తెలుస్తోంది. కాగా, బస్సు డ్రైవర్ ఢిల్లీ నుంచి రాంగ్ డైరెక్షన్లో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.
Read Also: కాంగ్రెస్కు షాకిచ్చేలా కేటీఆర్ కీలక పిలుపు
Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat