పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోయర్ కాఫర్ డ్యాం, అప్పర్ కాఫర్ డ్యాం, స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ నిర్మాణం పూర్తి చేసిన ఘనత సీఎం జగన్‌దేనని ప్రశంసించారు. కానీ, టీడీపీ నేతలు, సంబంధిత మీడియా వర్గాలు మాత్రం పోలవరం ప్రాజెక్టు, వైసీసీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టు పట్టాలెక్కకుండా అడ్డుపడింది గత టీడీపీ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును మధ్యలోనే వదిలేసి పారిపోయిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు(Chandrababu) నిర్లక్ష్యం వల్లే నిర్మాణంలో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించటం వల్లనే పోలవరం ప్రాజెక్టు మరింత ఆలస్యమైందని అంబటి(Ambati Rambabu) ఆరోపించారు.
Read Also: బోనాల పండుగకు ముందురోజు బోయిన్‌పల్లిలో దారుణం
Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat