Revanth Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్‌ది ఆల్ టైం రికార్డు: రేవంత్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. ‘రైతుతో రాజకీయం చేయడానికి బీఆర్ఎస్ బయలు దేరింది. రైతు వేదికలను ఇన్నాళ్లు అలంకార ప్రాయంగా ఉంచిన ఆ పార్టీ.. ఇప్పుడు వాటిని రాజకీయ వేదికలుగా మార్చడానికి బరితెగించింది. రైతు రుణ మాఫీ కోసం ఇన్నాళ్లు మనం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశాం. చివరి బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టడం అయిపోయింది.

- Advertisement -

ఇక రుణమాఫీ చేయబోదన్న విషయం స్పష్టత వచ్చేసింది. రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య అక్షరాలా 31 లక్షలు. రూ.20 వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేయాల్సిన ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసింది. కేసీఆర్ మాటలకు మోసపోయి అప్పుల ఊబిలో చిక్కిన మన సహచరులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని జారీ చేసిన ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయి.

జూన్ 15 నాటికి రూ.6,800 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత తొమ్మిదేళ్లలో లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పేదల నుండి ప్రభుత్వం లాక్కుంది. పేద గిరిజన, దళిత బిడ్డలకు భూములు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి చేతులు రాలేదు. కానీ.. ఎన్నికలు సమీపిస్తుండటంతో పోడు భూముల పట్టాలపై కేసీఆర్ ప్రభుత్వం హడావుడి మొదలు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 11.50 లక్షల మంది ఆదివాసీలు పోడు పట్టాలకు అర్హులని తేలింది. కానీ, కేవలం నాలుగు లక్షల మందికి పట్టాలు ఇచ్చినట్టు చేసి చేతులు దులుపుకుంది.

రైతులకు ఎరువులు ఫ్రీగా ఇస్తామని ప్రభుత్వం మోసం చేసింది. రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి కేవలం 10 గంటలు కూడా ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ ఆధారాలను బయటపెట్టడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. రైతులను మోసం చేసిన విషయంలో కేసీఆర్ ది ఆల్ టైం రికార్డు. రైతు వేదికల సాక్షిగా రాజకీయానికి బీఆర్ఎస్ నేతలు వస్తున్నారు. ఆ రైతు ద్రోహులకు బుద్ధి చెప్పడానికి ఇదే మంచి అవకాశం’ అని రైతులకు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పిలుపునిచ్చారు.

Read Also: హిమాన్షు మాట్లాడిన మాటల్లో తప్పులేదు: కేటీఆర్
Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...