Komatireddy Venkat Reddy | రేవంత్ రెడ్డిని తిడితే చూస్తూ ఊరుకోము: MP కోమటిరెడ్డి

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ మంత్రులు, నేతలు బీసీలందరికీ ఆపాదిస్తున్నారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ పేరుతో కేసీఆర్ చెంచాలు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి తలసాని(Minister Talasani) ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బుధవారం హైదరాబాద్‌లోని వెంకట్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం జరిగింది.

- Advertisement -

ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) ఇవాళ బీఆర్ఎస్ బీసీ నేతలు సమావేశం అయి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌పై విమర్శలు చేయడంపై కౌంటర్ ఇచ్చారు. మా పార్టీ ముఖ్యనేతను తిడితే ఊరుకోవాలా అని మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఓ మాట అంటే బీసీలు అందరికీ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని, నిజానికి రేవంత్ రెడ్డి బీసీలను ఏమీ అనలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే బీసీలకు న్యాయం జరిగిందన్నారు. అన్ని కులాలను గౌరవించే సెక్యూలర్ పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు.

Read Also: MLA రాజాసింగ్‌కు ఈటల రాజేందర్ కీలక హామీ

Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...