Manipur Violence | మణిపూర్ అల్లర్లు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు స్పందించి సుమోటోగా స్వీకరించింది. తాజాగా.. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi) స్పందించారు. ఈ ఘటన 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుపడేలా చేసిందని, ఇది సిగ్గుపడాల్సిన విషయం అని మండిపడ్డారు. ఈ అమానవీయ ఘటనకు పాల్పడ్డ ఎవరినీ ఉపేక్షించబోమన్నారు. మహిళల భద్రత విషయంలో రాజీపడబోమన్నారు.
Manipur Violence |మణిపూర్ అల్లర్లపై ఫస్ట్ టైం స్పదించిన ప్రధాని
-