గంటాతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్

గంటాతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్

0
91

తెలుగుదేశం పార్టీకి గంటా గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైంది.. హస్తినలో బీజేపీ పెద్దలతో ఆయన మంతనాలు జరిపారు.. మొత్తానికి గంటాకి పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే రాజీనామా కూడా చేయనక్కర్దేదు అని బీజేపీ అధిష్టానం చెప్పింది.. బాబు మమ్మల్ని ప్రశ్నించలేరు అని బీజేపీ ప్లాన్ అందుకే గంటా రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేగా కొనసాగవచ్చు అని చెబుతున్నారట.

అంతేకాదు గంటాతో పాటు విశాఖలో ఆయన కోటరికి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు సిద్దం అయ్యారట ..వారు కూడా బీజేపీలో చేరేందుకు సిద్దం అయ్యారు. అయితే నడ్డా సమక్షంలో చేరుతారా లేదా అమిత్ షా సమక్షంలో చేరుతారా అనేది తేలాల్సి ఉంది.. వైసీపీలోకి ఆఫర్ వచ్చినా జగన్ రాజీనామా చేసి పార్టీలోకి రమ్మంటున్నారు. ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారు, అందుకే గంటా శ్రీనివాసరావు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారట.