పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కాంబినేషన్లో తర్కెక్కుతోన్న మల్టీ స్టారర్ సినిమా బ్రో. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 28న థియేటర్లలో పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది “బ్రో”. ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు మూవీ మేకర్స్. అయితే ఈ కార్యక్రమంలో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ అవడం అందరినీ షాక్ కి గురి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్(BRO Pre Release Event) లో పవన్ కళ్యాణ్ వేదికపై స్పీచ్ ఇస్తున్నారు. అందులో భాగంగా.. సినిమా గురించి, దర్శకుడి గురించి, నటీనటులు, సినిమా కి పని చేసిన వారి గురించి మాట్లాడుతూ ప్రశంసించారు. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ గురించి మాట్లాడలేదని వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) పవన్ కి చెవిలో చెబుతాడు. దీంతో అసహనానికి గురైన పవన్(Pawan Kalyan).. “చెప్తాను రా” అంటూ సీరియస్ అయ్యారు.
ఆ తర్వాత ఎవరినీ మర్చిపోను నేను. ప్రొడ్యూసర్ గురించి చెప్పడం ఎలా మర్చిపోతాను?” మా అందరికీ లైఫ్ ఇచ్చేది వాళ్ళే కదా అంటూ వేడెక్కిన వాతావరణాన్ని కూల్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు ఈ వీడియో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
Vaishnav Gaadu ????? pic.twitter.com/ISnbsjyaPH
— Raees (@RaeesHere_) July 25, 2023