Revanth Reddy | రూ.10 వేలు ఇవ్వకపోతే GHMC ని ముట్టడిస్తాం.. రేవంత్ బహిరంగ సవాల్

-

గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ ప్రజలు విలవిల్లాడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు కుంగిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు ప్రాజెక్టుల వద్ద ప్రమాద స్థాయిలో నీటిమట్టం చేరుకోవడంతో అధికారులు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక హైదరాబాద్ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న వర్షాలకు కూడా నగర రోడ్లు జలమయం అవుతున్నాయి. ఇక కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. లోతట్టు ప్రాంతాల వాసులు ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో వరదలు, సహయక చర్యలపై మంత్రి కేటీఆర్ కి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) బహిరంగ లేఖ లేఖ రాశారు.

- Advertisement -

రేవంత్(Revanth Reddy) లేఖలో పేర్కొన్న విషయాలు:

గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం విలవిలలాడుతోంది. లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ప్రజల గోసను పట్టించుకోవాల్సిన మీరు పత్తా లేకుండా పోయారు. పుట్టిన రోజు పండగలపై ఉన్న ఆసక్తి ప్రజల ఇబ్బందులపై లేదు. విశ్వనగరంగా తీర్చిదిద్దామని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి  పోటీ పడే మీరు… ప్రజలు బయటకు రావాలంటేనే ఆలోచించుకునే దుస్థితిని హైదరాబాద్ కు కల్పించారు. ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుంటూ తిరిగాల్సిన పరిస్థితిని కల్పించారు.

మీ అసమర్థ పాలనలో ఇది విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయింది. ట్రాఫిక్ సమస్యలతో నగర ప్రజలు నానా యాతన పడుతున్నారు. బీఆర్ఎస్ నేతల కబ్జాలు, అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలతోనే నగరానికి ఈ పరిస్థితి. చర్యలు తీసుకోవాల్సిన మీరు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ లో ఇటువంటి పరిస్థితి రాబోతుందని మేం హెచ్చరించినా పట్టించుకోలేదు. నగరంలో వరద బీభత్సం సృష్టిస్తున్నా… కనీసం సమీక్ష చేసే సమయం మీకు లేదు.

వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించినా.. ఎలాంటి  చర్యలు తీసుకోవడం లేదు. గతంలో వరదల సమయంలో మీరు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. అప్పట్లో ప్రకటించిన పది వేల సాయం ఎన్నికల పథకం గా మిగిలిపోయింది. ఇప్పటికైనా ప్రజల కష్టాలను తీర్చే ప్రయత్నం చేయండి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టండి. ప్రభావిత ప్రజలకు రూ. 10 వేల సాయం ప్రకటించండి. లేకపోతే శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. మీ చేతగానితనాన్ని ఎండగట్టి, తగిన బుద్ధి చెప్తాం అంటూ మంత్రి కేటీఆర్ ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ ద్వారా హెచ్చరించారు.

Read Also: తెలుగు రాష్ట్రాలను కలవరపెడుతున్న మహిళల మిస్సింగ్ రిపోర్ట్స్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...