Viral Video | ఒళ్లు గగుర్పొడిచే వార్త.. వ్యక్తి షర్ట్ లోకి నాగుపాము!

-

పామునులను చూస్తేనే కొందరు భయపడి పరుగులు తీస్తారు.. అలాంటిది ఒక వ్యక్తి షర్టులోకి ఏకంగా ఆరు అడుగుల బుసలు కొట్టే నాగుపాము దూరితే ఎలా ఉంటుంది. గుండె ధడేల్ మంటుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌(Viral Video)గా మారింది. వారి సంభాషణ ప్రకారం ఈ ఘటన నార్త్ ఇండియాలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ వ్యక్తి చెట్టు కింద పడుకున్నాడు. ఈ క్రమంలో నాగుపాము ఆ వ్యక్తి షర్టు లోపలికి వెళ్లింది. ఇది గమనించిన వ్యక్తి భయంతో వణికిపోతాడు. అతను కదలకుండా అలాగే కూర్చుని ఉండిపోతాడు.

- Advertisement -

అతని చొక్కా ఒకటి బటన్‌లు తెరిచి ఉండటంతో నాగుపాము తన తలను బయటకు పెట్టి చూస్తుంది. ఈ క్రమంలో గమనించిన కొందరు వ్యక్తులు అతడిని పాము నుంచి కాపాడే ప్రయత్నం చేశారు. చిన్నగా అతని షర్ట్ గుండీలు విప్పి.. తోక భాగం నుంచి బయటకు లాగారు. దీంతో అతను అక్కడి నుంచి వెంటనే ఊపిరి పిల్చుకోని లేస్తాడు, పాము మాత్రం అక్కడే నేలపై బుసలు కొడుతూ ఉంటుంది. ఈ ఘటనలో భాదితునికి ఎలాంటి గాయాలు కాలేదు. ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియరాలేదు. సోషల్ మీడియాలో వైరల్(Viral Video) కావడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: రూ.10 వేలు ఇవ్వకపోతే GHMC ని ముట్టడిస్తాం.. రేవంత్ బహిరంగ సవాల్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...