రాష్ట్రంలో వరద పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)తో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. వర్షాలు, వరదలతో సర్వం కోల్పోయిన ప్రజలకు, ప్రాంతాలకు చేతనైనంత సాయం చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడానికి రెండు హెలికాప్టర్లు సేవలు అందిస్తున్నాయని వెల్లడించారు. ఐదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పనుల కోసం మెహరించారని తెలిపారు.
ఇప్పటికే వరలతో ఇళ్లు నీటమునిగి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు, సహాయక చర్యలు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజల నరకయాతన అనుభవిస్తున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అంతేగాక, రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.