ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ వేగం పెంచింది. పార్టీలో చేరికలతో పాటు విపక్షాలపై చేసే విమర్శల్లోనూ దూకుడు పెంచింది. ఇన్నాళ్లూ ప్రజా క్షేత్రం విమర్శించిన అధికార పక్షం.. ఈసారి అసెంబ్లీ వేదికగా తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాల(TS Assembly Session) తేదీలను ఖరారు చేసింది. ఆగస్టు నెల 3 వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నెల జులై 31న (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ(TS Assembly Session)లో దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర కేబినెట్ చర్చించనున్నది. ఇందులో ముఖ్యంగా భారీ వర్షాల వల్ల సంభవించిన వరదలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేబినెట్ సమీక్షించనున్నది.
Read Also: మల్కా్జ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మిస్సింగ్!
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat