పాకిస్తాన్(Pakistan)లో జరిగిన భారీ బాంబు పేలుడులో 40 మంది మృతిచెందారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న బజౌర్ జిల్లా ఖార్ పట్టణంలో అతివాద ఇస్లామిక్ పార్టీ “జమియత్ ఉలెమా ఏ ఇస్లాం-ఎఫ్” ఆదివారం నిర్వహించిన సభను టార్గెట్ చేసుకొని ఈ బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 130 మంది గాయపడగా, వారిలో 17 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Pakistan | తీవ్ర గాయాలపాలైన వారిని మెరుగైన చికిత్స కోసం ప్రాంతీయ రాజధాని పెషావర్‌కు విమానంలో తరలిస్తున్నట్లు చెప్పారు. ఈ పేలుడులో జమియత్ ఉలెమా ఏ ఇస్లాం-ఎఫ్ పార్టీ స్థానిక అధ్యక్షుడు మౌలానా జియావుల్లా మరణించారు. ఈ సభలో పార్టీ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ పాల్గొనలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.