సౌతిండియా స్టా్ర్ డైరెక్టర్ శంకర్(Director Shankar), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కాంబినేషన్‌లో గేమ్ చేంజర్(Game Changer) అనే ప్రతిష్టా్త్మక చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ హైప్ క్రియేట్ చేయగా.. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని మెగా అభిమానులే కాకుండా ఇండియాలోని చరణ్, శంకర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇందులో బాలీవుడ్ క్వీన్ కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా.. ఈ చిత్రం(Game Changer) నుంచి దర్శకుడు శంకర్ ఓ క్రేజ్ అప్‌డేట్ ప్రకటించారు. ఆగష్టు నెలలో ఈ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ రాబోతోందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.