ప్రముఖ టీవీ సీరియల్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన నటుడు సోహెల్(Sohel).. బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నాడు. అందులో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ కూడా ఒకటి. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 18న విడుదల కానుంది.
కాగా, ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సోహైల్(Sohel) ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలో తాను ఎదుర్కొన్న అవమానాల గురించి తెలిపాడు. ‘టీవీ సీరియల్స్ నుంచి వచ్చాడు. వీడేం ఎదుగుతాడని అందరూ అంటుంటే భయమేసింది. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా గ్లింప్స్ విడుదల చేసినప్పుడు.. చూసి చాలామంది నన్ను హేళన చేశారు. వీడు తేడా గాడు అంటూ అవమానించారు. సోషల్ మీడియాలో చెండాలంగా మాట్లాడారు’ అంటూ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సోహెల్.
Read Also: పవన్ కల్యాణ్ బ్రో సినిమాపై మంత్రి అంబటి మరో ట్వీట్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat