Ustaad Bhagath Singh | పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్‌డేట్!

-

పవర్ పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌లో హరీశ్ శంకర్‌తో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన భగత్ సింగ్(Ustaad Bhagath Singh) ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ కావడంతో ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తైన విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి విడుదలై ఫస్ట్‌లుక్‌కు, ఫస్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి నెక్ట్స్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

అయితే, ప్రస్తుతం పవన్ కల్యాణ్(Pawan Kalyan) రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమా షూటింగ్ ఆగిపోయిందని, మళ్లీ ఏపీ ఎన్నికల తర్వాతే ప్రారంభం అవుతుందని ఇటీవల వార్తలు విస్తృతం అయ్యారు. దీంతో వీటన్నింటికి చెక్ పెట్టేలా డైరెక్టర్ హరీశ్ శంకర్(Harish Shankar) క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించినట్లు సమాచారం. దీంతో ఈ విషయాన్ని గమనించిన కల్యాణ్ ఫ్యాన్స్‌ ట్విట్టర్‌లో ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagath Singh) హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు.

Read Also: పూజగదిలో పచ్చకర్పూరం ఇలా ఉంచితే.. ఐశ్వర్యం, ఆరోగ్యం
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...