TSRTC: టీఎస్ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ రెడ్ సిగ్నల్? 

-

మరోసారి తెలంగాణలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. గత మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టాలనుకున్న ప్రభుత్వానికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఇది ఆర్థికపరమైన బిల్లు కావడంతో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అనుమతి కోసం సర్కార్ రాజ్‌భవన్‌కు పంపించింది. అయితే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ముసాయిదా బిల్లుపై మరింత సమయం కావాలని గవర్నర్ కోరారు. న్యాయపరమైన అంశాలు పరిశీలించి, న్యాయనిపుణుల సలహా తరువాత నిర్ణయం తీసుకుంటామని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ఆర్టీసీ ముసాయిదా బిల్లు ఆగస్టు రెండో తారీకు మధ్యాహ్నం 3.30 నిమిషాలకు రాజ్‌భవన్ చేరిందని పేర్కొన్నాయి.

- Advertisement -

మరోవైపు ఆర్టీసీ విలీనం బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కేసీఆర్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ బిల్లు ఆమోదం పొందితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. కానీ గవర్నర్ మాత్రం న్యాయపరమైన అంశాలు పరిశీలించిన తర్వాతే ఆమోద నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. ఆదివారంతో అసెంబ్లీ సమావేశాలు ముగియనుండడంతో ఈ బిల్లు ఆమోదం పొందుతుందో లేదో వేచిచూడాలి.

అటు గవర్నర్ తీరు పట్ల ఆర్టీసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 43, 373 మంది కుటుంబాలలో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని టిఎంయు ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ బిల్లును వెంటనే ఆమోదించాలి లేకపోవతే ఆర్టీసీ కార్మికులంతా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలను చేపడతామన్నారు. అవసరమైతే రాజ్‌భవన్ ముట్టడికి కూడా వెనకాడమని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘మరోసారి బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర’ 

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం...

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...