కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, యాక్టర్ సముద్రఖని(Samuthirakani) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. భీమ్లానాయక్ సినిమాలో విలన్‌గా నటించిన ఆయన.. తాజాగా.. పవన్ కల్యాణ్‌తో బ్రో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పటికే తెలుగులో మహేశ్ బాబు, అల్లు అర్జున్(Allu Arjun) చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, బ్రో సినిమా విడుదలకు ముందు ఆయన పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగా హీరోలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రామ్‌చరణ్, అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా సమయంలో చరణ్, తాను(Samuthirakani) స్నేహితులమయ్యామని చెప్పారు. చరణ్‌ను కుమారుడిలా భావిస్తానని అన్నారు. అల్లు అర్జున్ అందరితోనూ ప్రేమగా ఉంటారని చెప్పారు. అంతేకాదు.. రామ్‌చరణ్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’లో నటించానని, తనను చరణ్ బాబాయ్ అని పిలిచేవాడని గుర్తుచేసుకున్నాడు. చరణ్(Ram Charan)కు ఏ కష్టం రాకూడదని దేవుడిని ప్రార్థించే వారిలో తానూ ఉంటానని అన్నారు. చరణ్–ఉపాసన దంపతులకు క్లీంకార పుట్టినప్పుడు మెసేజ్ పెట్టానని తెలిపారు.