Gaddar | ప్రజాకవి గద్దర్ అంత్యక్రియలపై చెలరేగిన వివాదం

-

తెలంగాణ ప్రజాగాయకుడు గుమ్మడి విఠల్ రావు(గద్దర్) అంత్యక్రియలపై వివాదం చెలరేగుతోంది. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్ణయించడం నక్సలైట్ వ్యతిరేక పోరాటంలో అమరులైన పోలీసులు, పౌరుల త్యాగాలను అవమానించడమే అని యాంటి టెర్రరిజం ఫోరం(ATF)తీవ్ర అభ్యంతర వ్యక్తంచేసింది. తన విప్లవ పాటల ద్వారా వేలాది మంది యువకులను నక్సలైట్ ఉద్యమం వైపు మళ్ళించిన వ్యక్తి గద్దర్(Gaddar) అని ATF కన్వీనర్ రావినూతల శశిధర్ తెలిపారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరకంగా తుపాకీ పట్టిన నక్సల్స్ ఉద్యమం వేలాది మంది పోలీసులను బలితీసుకుందని పేర్కొన్నారు. అంతేకాకుండా సాధారణ పౌరులతో పాటు జాతీయ వాదులపై కూడా దాడులు జరిపి అనేక మందిని బలితీసుకుందన్నారు.

- Advertisement -

ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయిధ పోరాటాలు చేయడానికి తన సాహిత్యం ద్వారా యువతను దేశ ద్రోహులుగా తయారు చేసిన గద్దర్ లాంటి వ్యక్తికి అధికారికంగా అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య, శాంతి భధ్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులు, ప్రజల త్యాగాలను అవమానించడమే అవుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయం పోలీసు బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన వెల్లడించారు. సర్కార్ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య వాదులు ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు.

పోలీసు అమరవీరుల కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా కలత చెందుతున్నాయని పేర్కొన్నారు. పోలీసు అధికారుల సంఘం కూడా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై నోరు విప్పాలని సూచించారు. దీనిని ఓ వ్యక్తికి జరుగుతున్న అంత్యక్రియలుగా మాత్రమే చూడకూడదని.. మావోయిజం భావజాలానికి పోలీసు బలగాలతో అధికారికంగా సెల్యూట్ చేయించడమే అవుతుందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని శశిధర్ డిమాండ్ చేశారు.

మరోవైపు గద్దర్(Gaddar) మృతితో తన సొంత స్వగ్రామం మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తూప్రాన్ పట్టణంలో గద్దర్ మృతికి సంతాపంగా స్వచ్ఛందంగా షాపులు, విద్యాసంస్థలు మూసివేశారు. తెలంగాణ ఉద్యమకారులు, గాయకులు, కళాకారులు తూప్రాన్లో ర్యాలీ నిర్వహించి గద్దర్‌కు నివాళులర్పించారు.

Read Also: గద్దర్ మరణానికి కారణం ఏంటంటే?
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...