Rahul Gandhi | రాహుల్ గాంధీపై అనర్హత వేటు ఎత్తివేసిన లోక్‌సభ

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తిరిగి పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు. గతంలో ఆయనపై వేసిన అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. దీంతో నేడు జరిగే లోక్‌సభ సమావేశాలకు ఎంపీ హోదాలో రాహుల్ హాజరయ్యారు. మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీని పార్లమెంటులో మాట్లాడించాలని ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం తెలిసిందే. ఈ తరుణంలో రాహుల్ గాంధీ కూడా లోక్‌సభలో అడుగుపెట్టడం శుభపరిణామంగా విపక్షాలు భావిస్తున్నాయి.

- Advertisement -

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కర్నాటక వెళ్లిన రాహుల్ గాంధీ ప్రచారంలో మోడీ(Modi) ఇంటి పేరున్న వారంతా దొంగలేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్(Surat) కోర్టులో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు ఈ ఏడాది మే నెలలో రాహుల్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు చేస్తూ సచివాలయం ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే ఆ తర్వాత రాహుల్ గాంధీ(Rahul Gandhi) జిల్లా కోర్టును, గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన ఊరట లభించలేదు. దీంతో చివరగా సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రింకోర్టు.. ఈ నెల 4న స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటును రద్దు చేస్తూ లోక్‌సభ సచివాలం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: ప్రజాకవి గద్దర్ అంత్యక్రియలపై చెలరేగిన వివాదం
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...