Chandrayaan 3 | జాబిల్లికి మరింత దగ్గరగా చంద్రయాన్-3.. వీడియో వైరల్

-

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ 3(Chandrayaan 3) ప్రయోగంలో మరో కీలక అడుగు పడింది. తాజాగా భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 చంద్రుడికి అతి చేరువలోకి వెళ్లిన స్పేస్‌ క్రాఫ్ట్‌ తాజాగా ఓ వీడియోను రికార్డు చేసి పంపింది. చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన ఈ వీడియోను ఇస్రో విడుదల చేసింది. ఈ వీడియోలో చంద్రుడు చాలా దగ్గరగా కనిపిస్తున్నాడు. చంద్రుడి ఉపరితలంపై గల లోయలు, పర్వతాలు, గ్రహశకలాల దాడుల దృశ్యాలను ఈ వీడియోలో చూడొచ్చు. వెలుగు వైపు నుంచి చంద్రుడి చీకటివైపు వెళ్తున్న దృశ్యాలు క్లియర్‌గా వీడియోలో కనిపిస్తున్నాయి.

- Advertisement -

జులై 14,2023న చంద్రయాన్ 3 ప్రయోగం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కక్ష్యను పెంచుకొని ఆగస్టు 1వ తేదీన చంద్రుడిని చేరే లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలోకి ప్రవేశించింది. అనంతరం జాబిల్లికి చేరువగా ఉండే బిందువులోకి ప్రవేశించింది. ఆగస్టు 5న చంద్రుని కక్ష్య లోకి వెళ్లిన సమయంలో చంద్రయాన్-3 అంతరిక్ష నౌక వీక్షించినట్లుగా ట్విట్టర్‌లో తెలిపారు. చంద్రయాన్‌-3 మొదటిదశ కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఆగస్టు 6 వ తేదీ రాత్రి 11గంటలకు విజయవంతంగా ఇస్రో(ISRO) అధికారులు నిర్వహించారు. ఇలా కక్ష్యను తగ్గిస్తూ ఈ నెల 17 తర్వాత వ్యోమనౌకను చంద్రుడికి చేరువ చేస్తారు. అనంతరం వ్యోమనౌకను చంద్రుడికి 100 కి.మీల ఎత్తులోకి తీసుకెళ్లి.. ఈ నెల 23న చంద్రుడిపై ల్యాండర్‌ను ల్యాండ్ చేస్తారు.

చంద్రుడిపై అధ్యయనం కోసం 2019లో ఇస్రో భారత్ చంద్రయాన్ 2 ప్రాజెక్టు‌ చేపట్టింది. అయితే ఈ ప్రయోగం విజయవంతం కాలేదు, చంద్రుడిపై ల్యాండర్ దిగుతూ క్రాష్ ల్యాండింగ్ జరిగింది. అక్కడ ప్రతికూల వాతావరణమే దీనికి కారణంగా గుర్తించారు. భారీ బండరాళ్లు, గుంతలు, గడ్డకట్టిన మట్టితో చంద్రుని ఉపరితలంపై పరిస్థితులు ల్యాండింగ్‌కు ఏమాత్రం సహకరించలేదు. చంద్రుడి కక్ష్య వరకూ ల్యాండర్ చేరుకోవడం ఒక ఎత్తైతే.. ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వడం మరో ఎత్తు. ఈ కారణంతోనే చంద్రయాన్-2‌ ప్రయోగం విఫలమై క్రాష్ ల్యాండింగ్ అయింది. ఈసారి చంద్రయాన్ 3(Chandrayaan 3)లో అలాంటి తప్పిదాలు జరగకుండా అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకున్నారు.

Read Also: రాహుల్ గాంధీపై అనర్హత వేటు ఎత్తివేసిన లోక్‌సభ
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...