టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu)ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సినిమా విడుదల రోజు థియేటర్ల వద్ద పండుగ వాతావరణాన్ని తలపించేలా సందడి చేస్తుంటారు. ప్రస్తుతం వీరిద్దరి పుట్టినరోజులు సమీపిస్తుండటంతో వీరి అభిమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరి ఫొటోలతో కామన్ డీపీ సెట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిని అతి త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా, ప్రస్తుతం హరీశ్ శంకర్(Harish Shankar), సుజిత్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల్లో పవన్(Pawan Kalyan) నటిస్తుండగా.. మహేశ్ బాబు త్రివిక్రమ్‌తో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు.