ఎన్టీఆర్‌కి కేంద్రం ఘన నివాళి.. రూ.100 నాణెం ముద్రించిన ఆర్బీఐ

-

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, దివంగత మాజీ సీఎం అన్న నందమూరి తారకరామారావు(Senior NTR)కు మరో అరుదైన గౌరవం లభించింది. నటుడిగానే కాదు.. గొప్ప రాజకీయ నాయకుడిగానూ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి నాయకుని శత జయంతి ఉత్సవాలను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో కేంద్రం ఆయనకు ఘన నివాళులర్పించేందుకు నిర్ణయం తీసుకుంది. శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ బొమ్మతో ఆర్బీఐ ప్రత్యేక నాణెం రూపొందించింది.

- Advertisement -

రూ.100 నాణాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సూచనలతో అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. 44 మిల్లీమీటర్లు చుట్టుకొలతతో ఉండే ఈ నాణెంలో సుమారు 50 శాతం వెండి అలాగే 40 శాతం రాగీ ఉండనుంది. ఐదు శాతం నికెల్, ఐదు శాతం లోహాలు ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం మరోవైపు ఎన్టీఆర్(Senior NTR) చిత్రం.. దాని కింద శ్రీ నందమూరి తారక రామారావు శతజయంతి 1923-2023 అని ముద్రించినట్లుగా తెలిపింది.

ఈ నెల 28వ తేదీన ఈ నాణేన్ని అధికారికంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విడుదల చేయనున్నారని తెలిపింది. ఇప్పటికే దీని గురించి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులందరికీ సమాచారం అందించారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్వయంగా ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఆహ్వానాలు పంపించారు.

నందమూరి తారక రామారావు 1923 మే 28వ తేదీన కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. ఈ ఏడాదితో ఆయన పుట్టి వందేళ్లు కావడంతో వచ్చే ఏడాది మే 28 వరకు కూడా శత జయంతి ఉత్సవాలు జరపాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Read Also: ఆ దేవుడే విపక్షాల చేత అవిశ్వాసం పెట్టించాడు: ప్రధాని మోడీ

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...