ఇంత దిగజారిన ప్రధానిని ఎప్పుడూ చూడలేదు: రాహుల్

-

మణిపూర్‌ను బీజేపీ పెద్దలు హత్య చేశారని, రెండుగా చీల్చారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. లోక్‌సభలో ప్రధాని మోదీ(Modi) ప్రంగంపై రాహుల్‌ విమర్శల వర్షం కురిపించారు. మణిపూర్‌పై ప్రధాని స్పందించిన తీరు సరికాదన్నారు. మణిపూర్‌లో ఇప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. కానీ మోదీ మాత్రం జోకులు వేసుకుంటూ మాట్లాడారని మండిపడ్డారు. ఇది ఏ మాత్రం దేశానికి మంచిది కాదని సూచించారు. దేశంలో ప్రధానికి ఏం జరుగుతోందో తెలియడం లేదా అని నిలదీశారు.

 

- Advertisement -
దేశంలో ఇంత హింస జరుగుతుంటే లోక్‌సభ(Lok Sabha)లో ప్రధాని రెండు గంటలు టైమ్ పాస్ చేశారని విమర్శించారు. 2 గంటల 13 నిమిషాల పాటు లోక్ సభలో మాట్లాడిన మోదీ కనీసం రెండు నిమిషాలు మణిపూర్(Manipur) గురించి మాట్లాడలేదన్నారు. భరతమాతను హత్య చేశారని తాను ఊరికే అనలేదన్నారు. మణిపూర్‌, భారత్‌ను బీజేపీ హత్య చేసింది అనేదే తన ఉద్దేశం అన్నారు. ప్రధాని ఓ రాజకీయ నాయకుడిలా మాట్లాడటం దురదృష్టమన్నారు. గతంలో ఎందరో ప్రధానులను చూశానని.. కానీ ఇలా దిగజారి మాట్లాడిన ప్రధానిని తానెప్పుడూ చూడలేదని రాహుల్(Rahul Gandhi) వెల్లడించారు.

 

మణిపూర్ మండుతుంటే… ప్రజలు చనిపోతుంటే పార్లమెంటులో మోదీ నవ్వుతూ కనిపించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత సైన్యానికి అవకాశం ఇస్తే రెండు గంటల్లో మణిపూర్‌ పరిస్థితిని చక్కదిద్దుతుందన్నారు. కానీ మణిపూర్‌ తగలబడటమే మోదీకి ఇష్టమని.. ఇది అత్యంత బాధాకరమన్నారు. మణిపూర్‌లో దారుణ పరిస్థితులను చూసి కేంద్ర దళాలే ఆశ్చర్యపోయాయన్నారు. అగ్నిగుండంలా మారిన మణిపూర్‌ను చల్లార్చడానికి బదులు బీజేపీ మరింత అగ్గిరాజేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌, ఇతర నేతల గురించి విమర్శలకే మోదీ ప్రాధాన్యమిచ్చారన్నారు. ప్రధాని కనీసం మణిపూర్‌ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. తన మొహాన్ని టీవీలో చూడటం మోదీకి ఇష్టం లేదేమో.. అందుకే తాను మాట్లాడేటప్పుడు తక్కువగా చూపించారేమో అని రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...