హైదరాబాద్‌లో WWE రెజ్లింగ్ పోటీలు.. టికెట్లు ఎలా పొందాలంటే?

-

మీరు వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE)అభిమానులా? అయితే మీకో పెద్ద శుభవార్త. అందులోనూ తెలుగు రాష్ట్రాలకు చెందిన అభిమానులకైతే పండగ లాంటి న్యూస్. WWE పోటీలకు తొలిసారి హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. హైద‌రాబాద్ వేదిక‌గా సెప్టెంబ‌ర్ 8 నుంచి డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ(WWE)సూపర్‌స్టార్ స్పెక్టాకిల్ ప్రారంభం కానుంది. గ‌చ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఈ రెజ్లింగ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది.

- Advertisement -

WWE పోటీలకు తొలిసారి మన హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఇండియాలో రెండోసారి ఈ ఈవెంట్ జరగనుంది. 2017లో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు జ‌రిగాయి. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత భాగ్యనగరంలో జరగనున్నాయి. ఈ ఈవెంట్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు వైఏటీ అండ్‌ సి డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయగౌడ్‌ ఈ ఈవెంట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ పోటీల్లో అంత‌ర్జాతీయంగా ప్ర‌సిద్ధి చెందిన 28 మంది రెజ్లింగ్ స్టార్లు పాల్గొన‌నున్నారు.ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ ఫ్రీకిన్ రోలిన్స్, మహిళల ప్రపంచ ఛాంపియన్ రియా రిప్లే, ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ సమీ జైన్, కెవిన్ ఓవెన్స్‌, ఇంటర్‌కాంటినెంటల్ ఛాంపియన్ ది రింగ్ జనరల్ గుంథర్, జిందర్ మహల్, వీర్, సంగ, డ్రూ మెక్‌ఇంటైర్, బెక్కీ లించ్, నటల్య, మాట్ రిడిల్, లుడ్విగ్ కైజర్ వంటి స్టార్‌లు ఇందులో పోటీప‌డ‌నున్నారు. హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌నున్న ఈ ఈవెంట్ టికెట్లు www.bookmyshow.com ద్వారా బుక్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...