విశాఖలో బేబీ సినిమా రిపీట్.. ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో ఇద్దరు ఆత్మహత్య

-

బేబీ సినిమా చూశారా? అందులో హీరోయిన్ ఒకేసారి ఇద్దరితో ప్రేమ నాటకం ఆడిన సంగతి గుర్తుకొచ్చిందా? అచ్చు గుద్దినట్లు అదే స్టోరీ నిజ జీవితంలో జరిగింది. సినిమాలో హీరో పిచ్చోడుగా మారిపోతే.. రియల్‌ లైఫ్‌లో అమ్మాయితో పాటు ఓ లవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్నంలో ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఇంటర్ చదువుతున్న ఓ అమ్మాయి ఒకే సమయంలో ఇద్దర్ని ప్రేమించింది. ఇందులో ఒకర్ని రహస్యంగా పెళ్లి చేసుకుంది. అంతటితో ఆగకుండా మరో లవర్‌తోనూ ప్రేమాయణం కొనసాగించింది. చివరికి ఈ ట్రయాంగిల్ ప్రేమ యువతినే బలితీసుకుంది.

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపాలెం నాగేంద్ర కాలనీకి చెందిన 16 ఏళ్ల అమ్మాయి వైజాగ్‌లోని ఓ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఆదర్శ నగర్‌కు చెందిన సూర్యప్రకాశ్.. ఇందిరా నగర్‌కు చెందిన సాయి కుమార్‌లను ఒకేసారి ప్రేమించింది. ఈ క్రమంలో సాయికుమార్ ఓ రోజు ఆ అమ్మాయి మెడలో రహస్యంగా తాళి కట్టాడు. పెళ్లి కట్టిన తర్వాత కూడా యువతి సూర్య ప్రకాశ్‌తో కూడా ప్రేమగా ఉండేది. దీంతో అమ్మాయి, సాయికుమార్ మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. మరోవైపు సాయికుమార్‌ను పెళ్లి చేసుకున్న ఫోటోలు, వీడియోలు సూర్యప్రకాశ్ చూశాడు. దీంతో సూర్య ప్రకాశ్ కూడా ఆమెతో గొడవకు దిగాడు. ఇద్దరు అమ్మాయి ఇంటికి వెళ్లి మాలో ఎవరితో ఉంటావో.. నువ్వే డిసైడ్ చేసుకోవాలని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన యువతి ఆగష్టు 10న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

యువతి ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియడంతో.. పోలీసుల భయంతో సూర్యప్రకాశ్ రైల్వే ట్రాక్ దగ్గర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా.. మైనర్ అమ్మాయిని రహస్యంగా పెళ్లాడిన సాయికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తానికి తెలిసీ తెలియని వయసులో వ్యామోహం మైకంలో ఓ 16ఏళ్ల బాలిక చేసిన తప్పు మూడు కుటుంబాల్లో విషాదఛాయలు నింపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...