స్మశానంలా మారిపోయిన భూతల స్వర్గం 

-

శతాబ్దాల చరిత్ర కలిగిన హవాయి ద్వీపంలో ఎటు చూసినా బూడిదే కనిపిస్తోంది. అమెరికా హవాయి దీవిలోని లహైనాతో పాటు మౌయి రాత్రికి రాత్రే స్మశానంలా మారిపోయాయి. భీకర కార్చిచ్చుకు బలవుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దాదాపు వందమందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. హవాయి కార్చిచ్చును ఈ శతాబ్దంలోనే అతిపెద్ద విపత్తుగా ప్రకటించింది అమెరికా ప్రభుత్వం. వారం క్రితం మొదలైన కార్చిచ్చు నగరాన్ని దహించివేసింది. హరికేన్ ప్రభావంతో బలమైన గాలుల కారణంగా మంటలు క్షణాల్లో నగరమంతా విస్తరించాయి. శరవేగంతో మంటలు వ్యాపించి అందాల నగరాన్ని దగ్ధం చేశాయి.

- Advertisement -

సహాయక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇళ్లు, వాహనాలు, జంతువులు, పక్షులు మంటల్లో కాలిపోయాయి. కార్చిచ్చు కారణంగా వేలాది మంది నిరాశ్రయులుగా మారిపోయారు. హవాయి చరిత్రలోనే ఇది అతిపెద్ద విపత్తు అని అధికారులు తెలిపారు. హవాయిలో ప్రస్తుతం 12 వేల మంది నివాసం ఉంటున్నారు. 100 ఏళ్లలో ఇంతటి తీవ్రమైన ప్రమాదం ఎన్నడూ చూడలేదని అంటున్నారు అధికారులు. అగ్ని ప్రమాద తీవ్రతను తక్కువగా అంచనా వేశామని.. కానీ భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. 6 బిలియన్‌ డాలర్ల వరకు నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు కార్చిచ్చు ఇప్పటికీ రగులుతూనే ఉంది. హవాయిలో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ ఫ్యామిలీ దాదాపు 5 గంటల పాటు పసిఫిక్‌ మహా సమద్రంలో తలదాచుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...