ప్రధాని మోదీ ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే రోజుల్లో మోదీ ధరించే తలపాగాలు ప్రత్యేకతను చాటుకుంటాయి. 2014 నుంచి పంద్రాగస్టు సందర్భంగా ఇప్పటివరకు మోదీ ధరిస్తున్న తలపాగా హైలెట్‌గా నిలుస్తోంది. స్వాతంత్ర్య వేడుకల్లో స్పెషల్‌గా కనిపించే ప్రధాని మోదీ.. ఈ ఏడాది కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాజస్థాన్‌కు చెందిన ప్రత్యేక బాంధిని డిజైన్ తలపాగాను ధరించారు ప్రధాని. ఈ తలపాగాలో ఎల్లో, రెడ్, గ్రీన్ కలర్స్ ఉన్నాయి.
ఇక 2014లో తొలిసారిగా ఎర్రకోటపై జెండాను ఎగురవేశారు ప్రధాని మోదీ. తెల్లని ఖాదీ కుర్తా, పైజమా, ఎరుపు, ఆకుపచ్చ జోధ్‌పురి బంధేజ్‌లో కనిపించారు.
2015లో క్రీమ్ కలర్ కుర్తా, దానిపై అదే కలర్ జాకెట్ వేసుకున్నారు. ఆరెంజ్ కలర్ తలపాగా..దానిపై రెడ్, గ్రీన్ కలర్ లైన్స్ ఉన్నాయి. ట్రై కలర్‌తో చేసిన పాకెట్ స్క్వేర్‌ను ఉంచారు.
2016లో సాదా కుర్తా ధరించి ఎర్రకోట ప్రాకారంపై నుంచి జాతీయ జెండాను మోదీ ఆవిష్కరించారు. గులాబీ, ఎరుపు, పసుపు రంగుల్లో టై అండ్ డై రాజస్థానీ టర్బన్‌ను ఎంచుకున్నారు.
2017లో ఎర్రకోట నుంచి నాలుగోసారి జాతీయ జెండాను ఎగురవేశారు ప్రధాని మోదీ. రెడ్, ఎల్లో కలర్స్ ఉన్న తలపాగాపై గోల్డ్ కలర్ లైన్స్ ఉన్నాయి.
2018లో..తెల్లటి కుర్తా-పైజమా, కాషాయం రంగు తలపాగాతో కనిపించారు. వైట్ కలర్‌పై బ్లాక్ కలర్ బోర్డర్ ఉన్న కండువాను ధరించారు.
2019లో తెలుపు రంగు కుర్తా, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ మిశ్రమంలో ఉన్న తలపాగా ధరించారు. ఆరెంజ్ కలర్ మెరూన్ కలర్ డాట్స్ ఉన్న కండువాను వేసుకున్నారు.
2020లో క్రీమ్ కలర్ కుర్తా..దానిపై కాషాయరంగు అంచు ఉన్న తెల్లటి కండువాను ధరించారు. అలాగే కాషాయం, పసుపు రంగు తలపాగాతో కనిపించారు.
2021లో ఎర్రకోటపై ప్రధాని మోదీ 8వ సారి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. వైట్ కలర్ కుర్తాపై కాషాయం రంగు అంచున్న తెల్లని కండువాను ధరించారు. ఆరెంజ్ కలర్‌పై రెడ్, వైట్ కలర్ లైన్స్ ఉన్న తలపాగా ధరించారు.
2022లో నీలంరంగు జాకెట్, తెల్లటి కుర్తా, త్రివర్ణపతాకంతో కూడిన తలపాగా ధరించారు. ఇలా తన డ్రెస్సింగ్ స్టైల్, ప్రత్యేక తలపాగాలతో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రధాని మోదీ నిలుస్తున్నారు.