భారత్(India)-చైనా(China) సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) బైక్ రైడింగ్ చేశారు. ఈ సందర్భంగా ‘ప్రపంచంలోనే అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్ సరస్సు ఒకటని మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా’ అంటూ రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవాళ పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. కాగా, గత గురువారం రాహుల్ గాంధీ లేహ్ పర్యటనకు వెళ్లారు.
తొలుత రెండు రోజులు మాత్రమే లేహ్‌లో ఉండాలని భావించినా.. ఆగస్టు 25 వరకు ఆయన తన పర్యటనను పొడిగించుకున్నారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత రాహుల్ గాంధీ లేహ్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా లేహ్‌లో శుక్రవారం నాడు 500 మంది యువకులతో రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. ఈ సమావేశం సుమారు 40 నిమిషాల పాటు సాగినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలియజేశాయి.
Few days back Shri @RahulGandhi Ji expressed his wish to visit Ladakh.
Today, RG is accelerating KTM 390 on the roads of Leh-Ladakh ?️? pic.twitter.com/UtfOpMdtA4
— Nitin Agarwal (@nitinagarwalINC) August 19, 2023