రేపే బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్.. మొత్తం ఎంతమందిని ప్రకటించనున్నారో తెలుసా?

-

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఎమ్మెల్యే ఆశావహులు విస్తృతంగా పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్(BRS) నేతలు ఎప్పుడెప్పుడు అభ్యర్థులు ప్రకటిస్తుందా? అని ఎదురుచూస్తున్న నేతలకు బీఆర్ఎస్ అధిష్టానం కీలక సూచనలు చేసింది. అభ్యర్థుల తొలి జాబితాను(BRS MLA Candidates) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 21న తెలంగాణ భవన్‌లో లాంఛనంగా విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా, శ్రావణ పంచమి మంచి ముహూర్తం కావడంతో సోమవారం సాయంత్రం ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. దానికి తగిన కసరత్తు కూడా దాదాపు పూర్తయిందని తెలిపాయి. వివాదాస్పదంగా ఉన్న కొన్ని స్థానాలు మినహా దాదాపు వందకు పైగా అభ్యర్థులను(BRS MLA Candidates) ప్రకటించవచ్చని సూచనప్రాయంగా తెలిపాయి. కేసీఆర్(KCR) లక్కీ నెంబర్ ఆరు కావడంతో 105 మంది పేర్లను ప్రకటించవచ్చని అంచనా వేస్తున్నారు.

Read Also: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి ఏపీ నేత, తెలంగాణకు మొండిచేయి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...