రాష్ట్రంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్(TS Engineering Counselling) ప్రక్రియ ముగిసింది. ఎంసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ సీట్లను అధికారులు గురువారం కేటాయించారు. దీంతో భారీగా ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోయాయి. ఈ విద్యాసంవత్సరంలో 16,296 సీట్లు మిగిలిపోయాయి. ఇందులో సీఎస్ఈ, ఐటీ కోర్సుల్లో 5,723 సీట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కోర్సులో 4,959 సీట్లు, సివిల్, మెకానికల్ కలిపి 5,156 సీట్లు, ఇతర కోర్సుల్లో మరో 458 సీట్లు భర్తీ కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 178 కాలేజీల్లో మొత్తం 85,671 బీటెక్ సీట్లున్నాయి. ఇందులో 69,375 సీట్లు (80.97 శాతం) భర్తీ అయ్యాయి.
TS Engineering Counselling | ఇంకా 16, 296 సీట్లు అలాగే ఉన్నాయి. యాజమాన్యాల వారీగా మిగిలిన సీట్లను పరిశీలిస్తే ప్రైవేట్ కాలేజీల్లో 14,511 సీట్లు మిగిలిపోయాయి. ప్రైవేట్ యూనివర్సిటీల్లో 289, యూనివర్సిటీ కాలేజీల్లో 1,496 సీట్లు మిగిలిపోయాయి. ఖాళీలను స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా కాలేజీలే విద్యార్థులను చేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 29వ తేదీలోగా ఫీజు చెల్లించి కాలేజీలో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు.