చిరంజీవికి, పవన్ కు నేను వీరాభిమానిని- మంత్రి అనిల్

చిరంజీవికి, పవన్ కు నేను వీరాభిమానిని- మంత్రి అనిల్

0
85

ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్…. చింరజీవి ఆయన సోదరుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… తాను రాజకీయాల్లోకి రాక ముందు చిరంజీవికి అభిమానినని అనిల్ తెలిపారు…

తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… చిరంజీవి అంటే తనకు అభిమానమని అలాగే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అలాగే రామ్ చరణ్ కూడా తాను అభిమానినే అని అన్నారు… ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను జగన్ అన్నకు తోడుగా ఉన్నానని అన్నారు…

పవన్ సినిమాల్లో ఉన్నంత వరకు తాను చిరంజీవి తమ్ముడునని చెప్పుకున్నారు… ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను ఒక కానిస్టేబుల్ కుమారుడినని చెప్పుకుటున్నారు.. ఇది కరెక్ట్ కాదు కదా అని తాను గతంలో ప్రశ్నించానని అనిల్ అన్నారు…