భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

-

మహారాష్ట్ర రాజధాని ముంబై(Mumbai)లోని శాంటాక్రజ్‌ ఏరియాలోగల గెలాక్సీ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైరింజన్‌లతో మంటలను ఆర్పేశారు. ఆ తర్వాత హోటల్‌లోని గదుల్లో చిక్కుకున్న వారిని బయటికి తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు ఐదుగురు క్షతగాత్రులు వెలికితీశారు. వారికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సజీవ దహనమైన ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. రెస్క్యూ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: తెలుగు భాషపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Gold Rates | రూ. లక్ష మార్క్ చేరుకోనున్న బంగారం ధర!!

దేశంలో బంగారం ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. మధ్యమధ్యలో స్వల్పంగా తగ్గుతూ...

Chandrababu | కార్యకర్తల్ని ఉద్దేశించి చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్

టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు....