ఈసారి పండగకి ‘నా సామిరంగ’.. అక్కినేని అభిమానులకు పూనకాలే.. 

-

టాలీవుడ్ కింగ్, నవ మన్మధుడు అక్కినేని నాగార్జున పుట్టినరోజు నేడు 64వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఆరు పదుల వయసు దాటినా అందంగా బాడీ మెయింటైన్ చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఈ బర్త్ డే సందర్భంగా తన కొత్త సినిమా నుంచి అదిరిపోయే అప్టేట్ ఇచ్చాడు నాగ్.

- Advertisement -

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నాగార్జున 99వ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ బిన్నీ అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీకి నా సామిరంగ అనే మాస్ టైటిల్ పెట్టారు. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్‌గా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాగ్ పంచకట్టెతో బీడీ కాలుస్తూ ఊర మాస్ లుక్‌లో అదిరిగొట్టాడు. ఈసారి పండక్కి నా సామిరంగ అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలు నెలకొనేలా చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఇక గత కొంతకాలంగా నాగార్జునకు సరైన హిట్ పడలేదు. తోటి పెద్ద హీరోలు చిరంజీవి, బాలకృష్ణ మాస్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ హిట్స్ కొడుతుంటే నాగ్ మాత్రం కాస్త వెనకబడ్డారు. అయితే ఈసారి మాత్రం బాక్సాఫీస్ దుమ్ములేపడం ఖాయమని నా సామీరంగ టీజర్‌తో హింట్ ఇచ్చాడు. 1986లో విక్రమ్ సినిమాతో నాగేశ్వరరావు వారసుడిగా పరిచయమైన నాగ్.. అనంతకాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. గీతాంజలి, శివ, నిన్నే పెళ్లాడతా, హలో బ్రదర్, అన్నమయ్య చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నాడు. ఇక వేంకటేశ్వరస్వామి భక్తుడిగా నటించిన అన్నమయ్య చిత్రం అయితే నాగార్జున కెరీర్‌లో మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...