సెప్టెంబర్ నెలలో ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

-

పార్లమెంట్(Parliament) ప్రత్యేక సమావేశాలకు కేంద్రం మొగ్గు చూపింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అమృత కాల ఘడియల నేపథ్యంలో ఈ సమావేశాలు ఏర్పాటు చేసినట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి(Pralhad Joshi) వెల్లడించారు. ఈ సమావేశాల్లో అయినా అర్థవంతమైన చర్చలు, ప్రసంగాలు ఉంటాయని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే కేంద్రం నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వినాయకచవితి సమయంలో సమావేశాలు నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లోనే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. గతంలో ఏపీ విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసింది. మళ్లీ ఇప్పుడు ఎలాంటి సందర్భం లేకుండానే ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది.

- Advertisement -

కాగా జులై 20న ప్రారంభమైన పార్లమెంటు(Parliament) వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11తో ముగిశాయి. ఈ సమావేశాలు మణిపూర్ హింసపై విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, విపక్షాల ఇండియా కూటమి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. అంతేకాకుండా ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం.. ఆ తీర్మానం వీగిపోవడం వంటివి జరిగిపోయాయా. తీర్మానం చివరిరోజు సందర్భంగా ప్రధాని మోదీ రెండు గంటల పాటు సుదీర్ఘంగా ప్రసగించి విపక్షాలపై సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే.

Read Also: రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో ప్రముఖ సినీ నిర్మాత
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘మరోసారి బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర’ 

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం...

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...