రేపే భారత్-పాక్ మధ్య ఉత్కంఠ పోరు.. వరుణుడు అడ్డు వచ్చే ఛాన్స్

-

Asia Cup 2023 | క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. శనివారం భారత్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జరగబోతోంది. ఆసియాకప్‌లో భాగంగా పల్లెకెలె వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌ ప్రారంభవుతుంది. ఇప్పటికే ఇరు జట్లు అక్కడికి చేరుకున్నాయి. మైదానంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. టోర్నీలో టీమిండియానే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది. పల్లెకెలెలో వర్షం పడే అవకాశం 94 శాతం ఉందని.. అలాగే పిడుగులు పడే అవకాశం 27 శాతంగా ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. తటస్థ వేదికల్లో భారత్‌-పాక్‌ జట్ల మధ్య 55 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీమ్‌ఇండియా 33 విజయాలు నమోదు చేసింది. శ్రీలంక వేదికగా ఆడిన వన్డేల్లో 56 శాతం విజయాలు భారత్‌వే ఉన్నాయి. మరొక విజయం సాధిస్తే వన్డేల్లో టీమిండియా రికార్డు సృష్టిస్తుంది. గత పది వన్డేల్లో పాక్‌పై ఏడు మ్యాచుల్లో భారత్‌ గెలిచింది.

- Advertisement -

ఆసియా కప్‌లో ఇప్పటివరకు దాయాది దేశాల మధ్య 17 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మూడు మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్‌లో తలపడ్డాయి. మొదటి ఆసియా కప్‌ 1984లో జరగ్గా.. ఆ సీజన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది.1988లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్లతో జయకేతనం ఎగరవేసింది. ఆ తర్వాత భారత్‌.. దాయాది దేశంపై మరో విజయం సాధించేందుకు దాదాపు 20 ఏళ్లు పట్టింది. 1995లో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియాపై పాక్‌ 97 పరుగుల తేడాతో నెగ్గింది. 1997లో జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దయింది. 2000, 2004 మ్యాచ్‌ల్లోనూ భారత్‌కు పరాజయం తప్పలేదు. 2008లో జరిగిన ఆసియా కప్‌లో భారత్, పాక్‌ రెండుసార్లు తలపడ్డాయి. గ్రూప్‌ దశలో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ నిర్దేశించిన 300 పరుగుల లక్ష్యాన్ని టీమ్‌ఇండియా 6 వికెట్లు కోల్పోయి 47 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఆసియా కప్‌లో పాక్‌పై భారత్‌కిది 20 ఏళ్ల తర్వాత మొదటి విజయం. సూపర్‌-4 దశలో భారత్‌పై పాకిస్థాన్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

2010 నుంచి 2022 వరకు ఆసియా కప్‌(Asia Cup)లో భారత్, పాక్ ఎనిమిదిసార్లు తలపడ్డాయి. ఇందులో టీమ్‌ఇండియా ఏకంగా 6 సార్లు విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించింది. 2010, 2012ల్లో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా.. 2014లో పాక్‌ నెగ్గింది. తర్వాత టీమ్‌ఇండియా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. టీ20 ఫార్మాట్‌లో జరిగిన 2016 ఆసియా కప్‌లో పాక్‌ని భారత్ 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. 2018లో ఇరుజట్లు రెండుసార్లు తలపడగా.. రెండింటిలోనూ విజయం సాధించి టీమ్‌ఇండియా హ్యాట్రిక్‌ కొట్టింది. గతేడాది టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లోనూ దాయాది దేశాలు రెండుసార్లు తలపడ్డాయి. గ్రూప్‌ దశలో జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలుపొంది వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత సూపర్‌-4 దశ మ్యాచ్‌లో 181 పరుగుల భారీ స్కోరు చేసినా పాక్‌ చేతిలో భారత్‌కు పరాజయం తప్పలేదు.

Read Also: MP రంజిత్‌ రెడ్డి భార్యకి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...