టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం

-

టాలీవుడ్ ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు(Drugs Case) మరోసారి కుదిపేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే పలు డ్రగ్స్ కేసుల్లో టాలీవుడ్‌లోని ప్రముఖుల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మాదాపూర్ లో జరిగిన పోలీసుల దాడిలో సినీ ఫైనాన్షియర్ వెంకటరత్నారెడ్డి అరెస్ట్ కావడం..మరో 18 మంది కేసులో ఇన్వాల్వ్ అయ్యారని తేలడంతో.. మరోసారి డ్రగ్స్ కేసు తెలుగు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఏడాది జూన్ నెలలో కబాలి ప్రొడ్యూసర్ కేపీ చౌదరి అరెస్ట్ కావడంతో డ్రగ్స్ కేసు తెరపైకి రాగా.. తాజా అరెస్టులతో టాలీవుడ్ కి డ్రగ్స్ కేసు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలు కీలక విషయాలు తెలిసినట్టు వార్తలు రాగా..ఇందులో కొందరు ప్రముఖులు సైతం ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తోంది. అదే నిజమైతే టాలీవుడ్ లో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశముంది.

- Advertisement -

ఈ కేసులో(Drugs Case) ఇప్పటికే సినీ ఫైనాన్షియర్ వెంకటరత్నారెడ్డితో పాటు బాలాజీ, మురళి అనే ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు.అంతేగాక, మరో 18 మందికి ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయని తేలింది. దీంతో ఆ18 మంది ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇందులో కొందరు ప్రముఖులు, బడా బాబులు ఉన్నట్లు తెలుస్తోంది. బాలాజీ ఫోన్ రికార్డ్స్ ద్వారా ఈ 18 మందికి కొకైన్, ఎక్స్టసి టాబ్లెట్స్ సప్లై చేసినట్లు ఆధారాలున్నాయని పోలీసులు వెల్లడిస్తున్నారు. మరోవైపు అన్ని డ్రగ్స్ కేసుల్లో లాగే ఇందులో కూడా ప్రముఖులు ఇన్వాల్వ్ అయ్యారని… వారిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. తాజాగా జరిగిన కబాలి ప్రొడ్యూసర్ కేపీ కేసులాగే ఈ కేసు కూడా నీరుగారిపోతుందని చెబుతున్నారు.

Read Also: MLA రఘునందన్ రావును అడ్డుకున్న పోలీసులు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...